‘లియో’ సెట్లోకి ఖల్నాయక్.. సంజూను కౌగిలించుకున్న దళపతి!
‘వారసుడు’తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్న దళపతి విజయ్ ఈసారి భారీ సినిమాతో రానున్నాడు. ‘విక్రమ్’ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీసి ఉత్సాహంలో ఉన్న లోకేశ్ కనగరాజ్ విజయ్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. లోకేశ్ యూనివర్స్‌లో తదుపరి ఫిల్మ్‌గా చెప్పుకుంటున్న ఈ చిత్రానికి ‘లియో’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ బిజినెస్ ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. అలాంటి ‘లియో’ చిత్రీకరణలో తాజాగా జాయిన్ అయ్యారు బాలీవుడ్ ఖల్నాయక్ సంజయ్ దత్. సంజూ బాబాను కౌగిలించుకుని మరీ షూట్‌లోకి ఆహ్వానించారు విజయ్. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.