కవిత దీక్షకు లిక్కర్ కేసుతో సంబంధం లేదు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ ముందు శనివారం హాజరయ్యారు. ఈడీ కార్యాలయంలోకి వెళ్తూ అందరికీ ఆమె అభివాదం చేశారు. పిడికిలి బిగించి జై కొట్టారు. ఇదిలాఉండగా..లిక్కర్ కేసు నేపథ్యంలోనే మహిళా రిజర్వేషన్ మీద ఢిల్లీలో కవిత దీక్ష చేపట్టారని విమర్శలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర నేతలు బండి సంజయ్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు కవిత లిక్కర్ స్కాం నేపథ్యంలోనే దీక్ష చేశారని దుయ్యబట్టారు.
కవిత మీద వస్తున్న విమర్శలపై రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ స్పందించారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు, హస్తినలో మహిళల రిజర్వేషన్‌పై కవిత చేపట్టిన దీక్షకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల తీరు తమకు విస్మయం కలిగిస్తోందన్నారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలోనే 2014 జూన్ 14న మహిళా రిజర్వేషన్లపై అసెంబ్లీలో తాము తీర్మానం చేసిన విషయాన్ని వినోద్ కుమార్ గుర్తుచేశారు.