Saturday, November 2, 2024

మగాళ్లది అంతా రివర్స్ సైకాలజీ.. మాజీ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

Must Read

మగాళ్లది అంతా రివర్స్ సైకాలజీ.. మాజీ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్​లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్​గా ఇంద్రజను చెప్పొచ్చు. హీరోయిన్​గా నటిస్తూనే మంచి పాత్రలు దొరికినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్​గానూ ఆమె రాణించారు. తన అందం, అభినయంతో ఎంతోమంది హృదయాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం ప్రముఖ ఛానెల్​లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ షోలో జడ్జిగా వ్యవహరిసత్ఉన్నారు. ఇక, నటనతో పాటు మహిళా సమస్యలపై గొంతెత్తడంలోనూ ఇంద్రజ ముందుంటారు.

తాజాగా మహిళల నెలసరి సమస్యలు, వారి ఎమోషన్స్, బాధ్యతల గురించి ఇంద్రజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలు మమ్మల్ని అర్థం చేసుకోలేరా అంటూ పదేపదే భర్తలను అడగడం వల్ల ఎలాంటి లాభం ఉండదన్నారు. సైలెంట్​గా ఉంటే వాళ్లే మనల్ని అర్థం చేసుకుంటారని ఇంద్రజ అన్నారు. మగాళ్లది అంతా రివర్స్ సైకాలజీ అని ఆమె చెప్పారు. ఓర్పు, సహనంతో ఉండాలన్నారు. అప్పుడే గౌరవం దక్కుతుందన్నారు. వ్యక్తిగత సమస్యలు, మూడ్ స్వింగ్స్​ను ఎవరికి వారే స్వయంగా హ్యాండిల్ చేయడం అలవర్చుకోవాలని ఇంద్రజ సూచించారు. ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

త్వరలో పాదయాత్ర చేస్తా!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని వెల్లడించారు. పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో కచ్చితంగా...
- Advertisement -

More Articles Like This

- Advertisement -