రణ్బీర్ ఖాతాలో మరో హిట్? ‘తూ ఝూటీ..’ పరిస్థితేంటి?
బాలీవుడ్కు కొన్నాళ్లుగా ఏదీ కలసిరావడం లేదు. బడా స్టార్లకు అక్కడ వరుస ఫ్లాప్లు ఎదురవుతున్నాయి. ఈమధ్య ‘పఠాన్’తో బిగ్గెస్ట్ హిట్ వచ్చినా.. అది షారుఖ్ ఖాన్ మేనియా అని అర్థమైపోయింది. ఇటీవల మరో స్టార్ హీరో రణ్బీర్ కపూర్, శ్రద్ద కపూర్ కలసి నటించిన ‘తూ ఝూటి మే మఖ్ఖర్’ రిలీజైంది. ఈ మూవీకి ప్రేక్షకులు, అభిమానుల నుంచి మోస్తరుగా మద్దతు లభించింది. వీకెండ్లో దుమ్మురేపిన ఈ చిత్రం.. సోమవారం మాత్రం వసూళ్లలో వెనుకపడింది. సోమవారం కేవలం 6 కోట్ల రూపాయలే వసూలు చేసింది. ఇప్పటి వరకూ రూ.76 కోట్లు వసూలు చేసిన రణ్బీర్ మూవీ మరో వారం వరకూ నిలకడగా కలెక్షన్స్ సాధిస్తే గట్టెక్కే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.