Tuesday, April 28, 2026

బంధువులు వద్దన్నా వెనకడుగు వేయలే.. ఒక్క టీకాతో ప్రపంచాన్ని ఆకర్షించాం

Must Read

బంధువులు వద్దన్నా వెనకడుగు వేయలే.. ఒక్క టీకాతో ప్రపంచాన్ని ఆకర్షించాం

కరోనా లాంటి మహమ్మారి నుంచి బయటపడేందుకు టీకాలు ఎంతగా ఉపయోగపడ్డాయో తెలిసిందే. వ్యాక్సిన్లు లేకపోతే ఎంతమంది ప్రాణాలు పోయేవో! అలాంటి టీకాల్లో కొవ్యాగ్జిన్ ఒకటి. ఈ టీకాను తయారు చేసింది. భారత్‌ బయోటెక్‌ సంస్థ. తెలుగువాళ్లు స్థాపించిన ఈ సంస్థ కొవ్యాగ్జిన్తో ఫుల్ సక్సెస్ అయ్యింది. తమ సక్సెస్ గురించి ఆ కంపెనీ ఎండీ సుచిత్ర ఎల్ల మాట్లాడారు. తమది అంకుర సంస్థేనన్నారు. అయితే ఇంతకుముందు ఎప్పుడూ లేనివిధంగా ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ వ్యాక్సిన్‌ను రూపొందించామని ఆమె వివరించారు.

రీసెర్చ్ ఎక్స్పీరియెన్స్ స్వదేశానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్‌ వచ్చిన తమకు బంధువుల నుంచి వ్యతిరేకత ఎదురైందని సుచిత్ర ఎల్ల చెప్పారు. అయినా వెనకడుగు వేయకుండా ఎదగడానికి ఎంతో కృషి చేశామన్నారు. కొవాగ్జిన్‌ టీకా తయారీతో ప్రపంచ దృష్టిని ఆకర్షించామన్నారు. వ్యాక్సిన్‌ తయారీ, పంపిణీకి సంబంధించి ఇండియాపై ప్రపంచానికి విశ్వాసం కలిగిందని సుచిత్ర ఎల్ల పేర్కొన్నారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -