నగ్న ప్రదర్శన చేయమంటారని భయపడ్డా.. అమ్మ బాగా కొట్టింది: పూనమ్ పాండే
బాలీవుడ్ హీరోయిన్లలో పూనమ్ పాండే గురించి తెలిసిందే. నటిగా అంత పేరు లేకపోయినా వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుందీ సిజ్లింగ్ బ్యూటీ. ఫొటో షూట్స్లో దిగిన హాట్ ఫొటోల్లో తన అందచందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. ఆమె పెట్టే బోల్డ్ ఫొటోలతో యువత కిర్రెక్కిపోతారు. అలాంటి పూనమ్ పాండే అప్పట్లో ఓ హాట్ కామెంట్ చేసింది. 2011 వరల్డ్కప్ ఫైనల్లో శ్రీలంక మీద భారత్ గెలిస్తే తాను దుస్తులు విప్పి నగ్న ప్రదర్శన చేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
ఎంఎస్ ధోని నేతృత్వంలోని టీమిండియా ఆ ప్రపంచకప్ను ఒడిసిపట్టినప్పటికీ పూనమ్ పాండే మాత్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. ఆమె న్యూడ్ ఫొటోలు పెట్టలేదు. దీని గురించి తాజాగా ఆమె స్పందించారు. ‘అప్పుడు నా వయసు 18 ఏళ్లు. ఏం చేయాలా అని ఆలోచించేదాన్ని. అప్పడు అందరూ క్రికెట్ మేనియాలో ఉన్నారు. దీంతో ఏదో ఒకటి చేయాలనుకున్నారు. భారత్ మొత్తం నావైపు చూసేలా ఆ స్టేట్మెంట్ ఇచ్చా. అయితే ఇండియా మ్యాచ్ గెలవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. నేను భయపడిపోయా. ఆ టైమ్లో అమ్మ నన్ను బాగా కొట్టింది. నాన్న కూడా కంగారుపడ్డారు’ అని ఆ రోజుల్ని పూనమ్ గుర్తుచేసుకున్నారు.