Thursday, October 23, 2025

News

తిరుపతికి బాంబు బెదిరింపు!

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని పలు హోటల్స్ లో బాంబులు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ వచ్చింది. అర్ధరాత్రి ఈ ఘటన జరగగా.. పోలీసులు అప్రమత్తమై హోటళ్లను చెక్ చేశారు. లీలామహల్‌ సమీపంలోని మూడు ప్రైవేట్ హోటల్స్, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు ఈ–మెయిల్‌లో బెదిరింపులు వచ్చాయి. తమిళనాడులో టెర్రరిస్ట్ జాఫర్ సాది​క్...

నటుడు బాలకృష్ణకు రేవంత్ సర్కార్ భూకేటాయింపు!

ఏపీ సీఎం వియ్యంకుడు, నటుడు నందమూరి బాలకృష్ణకు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించనుంది. బాలకృష్​ణ స్టూడియో నిర్మాణానికి రేవంత్ సర్కారు భూమి ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈమేరకు రెవెన్యూ అధికారులు సీఎస్ కు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇయ్యాల జరిగే కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది.

సీఎం సొంతూరులో లాఠీ ఛార్జ్!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. కొడంగల్‌లోని ఆర్బీ తండాలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా అక్కడి స్థానికులు ధర్నా చేశారు. తమ గ్రామాల్లో ఫార్మా కంపెనీలు వద్దంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి, ఆందోళనాకారులను చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో...

ముందు కట్టాలి..ఆ తర్వాత సబ్సిడీ ఇస్తాం!

ఎన్నికల సమయంలో ఇంటింటికీ మూడు ఉచిత సిలిండర్లు ఇస్తామని ఎన్డీఏ కూటమి ప్రచారం చేసింది. కానీ, గెలిచిన అనంతరం మెలికపెట్టింది. ముందు సిలిండర్లకు డబ్బులు ఇస్తేనే.. ఆ తర్వాత అకౌంట్ లో సబ్సిడీ జమ చేస్తామని తెలిపింది. ఈ పథకం వివరాలను సోమవారం మంత్రి సత్య నాదేండ్ల వెల్లడించారు. ఈ పథకం ఎల్.పి.జి.కనెక్షన్, తెల్ల...

కేటీఆర్ పరువు నష్టం కేసు.. కొండా సురేఖకు మొట్టికాయలు

మాజీ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నాంపల్లి కోర్టు మండిపడింది. కొండా సురేఖ వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ కేటీఆర్ నాంపల్లి కోర్టులో రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేయగా.. సోమవారం విచారణ చేపట్టింది. ఇంకెప్పుడూ కేటీఆర్ గురించి అడ్డగోలు వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. కొండా సురేఖ...

అమరావతి రైల్వే లైన్ ఎక్కడి నుంచి అంటే!

ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం రైల్వే లైన్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ రైల్వే లైన్ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఎక్కడ వ్యాపారాలు నిర్వహించాలి? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? అనే దానిపై నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, అమరావతికి మంజూరైన రైల్వే లైన్ విజయవాడ సమీపంలోని...

జీవన్ రెడ్డి తిరుగుబాటు!

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం! కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సొంత పార్టీపైనే అసహనం వెళ్ళగక్కారు. కాంగ్రెస్ పాలనలో సొంత పార్టీ నేతలకే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్య...

చంద్రబాబు ఇదేం లెక్క? కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్!

ఏపీ సీఎం చంద్రబాబుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మండిపడ్డారు. తిరుమల దర్శనానికి ఎమ్మెల్యేల నుంచి సిఫార్సు లేఖలు వస్తే టీటీడీ ఈవో తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. అదే ఆంధ్రా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణలోని యాదగిరి గుట్ట, భద్రాచలం వస్తే స్పెషల్ దర్శనాలు చేయిస్తున్నామని తెలిపారు. ఏపీలో మాత్రం తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు....

రష్యాకు నరేంద్ర మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యాకు బయలుదేరారు. కాజన్ నగరంలో జరిగే 16వ ‘బ్రిక్స్’ సదస్సులో పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోనూ మోడీ భేటీ కానున్నారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం, మధ్య ఆసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యాలో మోడీ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.

ముత్యాలమ్మ విగ్రహం పునర్ ప్రతిష్ఠ

ఇటీవల సికింద్రాబాద్ లో ఓ దుండగుడి చేతిలో ధ్వంసమైన ముత్యాలమ్మ విగ్రహాన్ని మంగళవారం పునర్ ప్రతిష్ఠించారు. మూడు రోజుల పాటు పూజలు నిర్వహించి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించనున్నారు. తొలిరోజు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజల్లో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం హాజరయ్యారు. నూతన విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కుంభాభిషేకం...

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...