తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి.. కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమురయ్య.. కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డిని ఎంపిక చేసింది.