TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 28 వరకు హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది. హరీశ్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ జి.చక్రధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హరీశ్‌రావు కోరారు. తదుపరి విచారణ 28కి వాయిదా వేసింది.