ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పూర్వంచల్ ప్రజలపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. బీజేపీ ఆధ్వర్యంలో పూర్వాంచల్ సమ్మాన్ మార్చ్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ఇంటి వద్దకు చేరుకున్న నిరసనకారులుల.. పూర్వాంచల్ వాసులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులకు, బీజేపీ నేతలకు వాగ్వాదం చోటు చేసుకుంది.