పిఠాపురంలో గోకులాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అమ్మాయిలను ఏడిపించి మగతనం అనుకుంటే తొక్కి నార తీస్తాం. పిఠాపురంలో ఈవ్‌టీజింగ్ అనేది ఉండకూడదు. క్రిమినల్స్‌కి కులం ఉండదు.. తప్పు చేసి కులాల చాటున దాక్కుంటే ఈడ్చుకొస్తాం.. మహిళలను జోలికి వస్తే తాట తీస్తాం. సొంత నియోజకవర్గాన్ని కాపాడుకోకపోతే నాకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు?’ అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.