రైతు భరోసా మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 26 నుంచి ఎకరానికి రూ.12 వేలు రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేయనున్నారు. భూ భారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది. భూవిస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు దీన్ని అందించనున్నారు. ROFR పట్టాదారులకు కూడా సాయం అందజేయనున్నారు....
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు వేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈనెల 28 వరకు హరీశ్ రావును అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది. హరీశ్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ జి.చక్రధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను...
పిఠాపురంలో గోకులాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'అమ్మాయిలను ఏడిపించి మగతనం అనుకుంటే తొక్కి నార తీస్తాం. పిఠాపురంలో ఈవ్‌టీజింగ్ అనేది ఉండకూడదు. క్రిమినల్స్‌కి కులం ఉండదు.. తప్పు చేసి కులాల చాటున దాక్కుంటే ఈడ్చుకొస్తాం.. మహిళలను జోలికి వస్తే తాట తీస్తాం. సొంత నియోజకవర్గాన్ని కాపాడుకోకపోతే నాకు...
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించింది. నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తం రెడ్డి.. కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమురయ్య.. కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డిని ఎంపిక చేసింది.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. పూర్వంచల్ ప్రజలపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. బీజేపీ ఆధ్వర్యంలో పూర్వాంచల్ సమ్మాన్ మార్చ్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ఇంటి వద్దకు చేరుకున్న నిరసనకారులుల.. పూర్వాంచల్ వాసులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులకు, బీజేపీ...
సినీ నటులు నయనతార, ధనుష్‌ల మధ్య నడుస్తున్న కోర్టు కేసు వాయిదా పడింది. తన నానుమ్‌రౌడీ సినిమాలోని ఓ సీన్‌ను తమ అనుమతి లేకుండా 'నయనతార బిహైండ్ ది ఫెయిరీ టెల్' పేరుతో డాక్యుమెంటరీలో కాపీ చేసిందని ధనుష్ ఆరోపించారు. మూడు సెకన్ల నిడివి ఉన్న సీన్‌కు ధనుష్ రూ.5 కోట్ల పరిహారం డిమాండ్...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో తిరుపతి రెడ్డి కోసం విద్యార్థులతో ప్రత్యేకంగా పరేడ్ నిర్వహించారు అధికారులు.తిరుపతి రెడ్డికి ఎలాంటి హోదా లేకపోయినా ఆయనకు ఎదురు వెళ్లి వికారాబాద్ జిల్లా కలెక్టర్ స్వాగతం పలికారు. మరోవైపు పరేడ్ సమయంలో విద్యార్థుల కాళ్ళకు షూస్, చెప్పులు...
దేశవ్యాప్తంగా విభిన్న భాషలలో ప్రేక్షకాదరణ కలిగిన టీవీ రియాలిటీ షో 'బిగ్‌బాస్' ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ సీజన్ 18 కొనసాగుతోంది. ఈ షో వీకెండ్‌లో క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్ పాల్గొననున్నారు. వీరు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ధనశ్రీ.. చాహల్...
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన విషయంలో టీటీడీ ఈవో, జేఈవో గౌతమీపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇది పద్ధతి కాదు, పద్ధతి ప్రకారం పని చేసేది నేర్చుకోండి. మీరు సమాధానం చెప్పండి. ఈ కేంద్రం వద్ద ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారని అధికారులను ప్రశ్నించారు. అలాగే
'ప్రతి ఒక్కరికి చెప్తున్నా.. పద్ధతి ప్రకారం నడుచుకోండి....
సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు తెలంగాణ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 13 నుంచి 23 వరకు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ తన పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ...