తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు పూర్తి పాటవాన్ని చదవాల్సి ఉందని, స్పీకర్‌కు మూడు...
ఏపీ కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర హోం మంత్రి అనిత, ఏపీ డీజీపీ శుక్రవారం ఉదయం ఫలితాలను ప్రకటించారు. ఈ మేరకు ఫలితాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు. వైసీపీ హయాంలో 2022 అక్టోబర్‌లో నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలు న్యాయ వివాదాల కారణంగా ఆలస్యమైనప్పటికీ, నేడు ఫలితాలు వెలువడ్డాయి. 2022 జనవరి...
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని దక్కన్ కిచెన్ కూల్చివేత కేసు నేడు నాంపల్లి కోర్టులో విచారణకు రానుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రముఖ సినీ నటులు దగ్గుబాటి వెంకటేశ్, రానా, నిర్మాత సురేష్ బాబుపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు ఫిల్మ్ నగర్ పోలీసులు...
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హెచ్‌సీఏలో అక్రమాలపై దర్యాప్తు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే కార్యదర్శి దేవరాజ్, ఖజాంచి శ్రీనివాస్ రావులను పదవుల...
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. రూ. 17 వేల కోట్ల రుణాల మోసం కేసులో దర్యాప్తు వేగవంతం చేస్తూ, ఆయనను ఆగస్టు 5న ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు....
వైసీపీ అధినేత వైయస్ జగన్ నెల్లూరు పర్యటన తీవ్ర ఉద్రిక్తతల నడుమ ముగిసింది. పర్యటన అనంతరం వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెల్లూరు నా గుండెల్లో ఉన్న ప్రదేశం అని, మీ ప్రేమే నాకు శక్తి అంటూ ప్రజలతో వ్యాఖ్యానించారు. ప్రజల కోసం తాను...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన ముందుగా నెల్లూరు సెంట్రల్ జైలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలుసుకున్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగన్ హెలికాప్టర్...
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఓ బాల్యవివాహం వెలుగులోకి వచ్చింది. భర్త మృతి చెందడంతో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ తన 13 ఏళ్ల కూతురిని 40 ఏళ్ల శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తికి వివాహం చేయించింది. మధ్యవర్తి సూచనతో ఈ వివాహం మే 28న జరిగింది. అప్పటి నుంచి...
చైనాలో షాంగ్జీ ప్రావిన్స్‌లో ఘటనచైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో కురిసిన భారీ వర్షాలు వరదలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ నగల దుకాణం తీవ్ర నష్టాన్ని చవిచూసింది. వరద ఉధృతికి షాపులో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు నీటిలో కొట్టుకుపోయాయి. అంచనా ప్రకారం సుమారు రూ.12 కోట్ల విలువైన ఆభరణాలు మిస్సైనట్లు సమాచారం. ఈ...
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. ఈ తీర్పులో భాగంగా, అసెంబ్లీ స్పీకర్ మూడు నెలల్లోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...