Thursday, April 16, 2026

హెచ్‌సీఏ అధ్య‌క్షుడిని తొల‌గించిన కౌన్సిల్‌

Must Read

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. హెచ్‌సీఏలో అక్రమాలపై దర్యాప్తు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ నేప‌థ్యంలో హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ప‌లు కీలక నిర్ణయాలు తీసుకుంది. అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే కార్యదర్శి దేవరాజ్, ఖజాంచి శ్రీనివాస్ రావులను పదవుల నుండి తొలగించినట్లు వెల్లడించింది. జూలై 28, 2025న నిర్వహించిన ఈ సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని అపెక్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. నిధుల దుర్వినియోగం, మోసం, అధికార దుర్వినియోగం వంటి తీవ్ర ఆరోపణల నేపథ్యంలో సీఐడీ, ఈడీ సంస్థలు ఇప్పటికే దర్యాప్తు జరుపుతున్నాయని తెలిపింది. అసోసియేషన్ నియమ నిబంధనల ప్రకారం పారదర్శకత, నైతిక విలువలకు కట్టుబడి ఉన్నామని, సంఘం న్యాయబద్ధతను కాపాడడానికే ఈ చర్యలు తీసుకున్నామని కౌన్సిల్ వెల్లడించింది. ఈ పరిణామాలతో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో కొత్త చర్చలు మొదలయ్యాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

తెలంగాణ శాసనసభలో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనల నేపథ్యంలో సభలో గందరగోళం చెలరేగింది. ఈ పరిణామాల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -