కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతోంది. నిఫా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మృతి చెందడం ఆందోళనకు కలిగిస్తోంది. నిఫా వైరస్ సోకి రాష్ట్రంలో ఇద్దరు మరణించారని, వారికి కాంటాక్ట్ లో ఉన్న 383 మందిని పర్యవేక్షణలో ఉంచామని, 16 మందిని ఆసుపత్రిలో చేర్చామని కేరళ వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు....
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ సింగ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర స్థాయి స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ మీట్ 2025లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన జస్టిస్ విక్రమ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి...
టాలీవుడ్ నటుడు మహేష్ బాబుకు కన్స్యూమర్ ఫోరం నోటీసులు జారీ చేసింది. గత ఏప్రిల్‌లో సాయి సూర్య డెవలపర్స్ విషయంలో ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. దీనికి ప్రచార కర్తగా ఉన్న మహేశ్‌ను ఆ ఫిర్యాదులో మూడవ ప్రతివాదిగా చేర్చారు. మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్ చూసి మోసపోయి, బాలాపూర్‌లో ఒక ప్లాట్...
ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులకు , కార్యకర్తలకు దేశ భక్తి, దైవ భక్తి ఉంటే సరిపోదని, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అంటే సరిపోదని, సమాజ సేవ చేయాలని వ్యాఖ్యానించారు. మాంసం తినేవారికి పార్టీలో స్థానం లేదంటే బీజేపీ పార్టీ ఎలా బలపడుతుందని...
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావడంతో ఆస్పత్రి పాలయ్యారు. కొద్ది రోజుల నుంచి సినిమాలు చేయడం లేదు. దీంతో ఆర్థికంగా ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి...
ఇటీవల అనారోగ్య సమస్యలతో యశోద ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రి నుంచి నేడు డిశ్చార్జి అయ్యారు. సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ గురువారం యశోద ఆసుపత్రిలో చేరారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం, సోడియం లెవెల్స్ తక్కువగా ఉండటం వంటి ఇబ్బందులు ఉన్నట్లు వైద్యులు...
రైతు రాజ్యం ఎవరు తెచ్చారు అనే దాని మీద కేసీఆర్, కేటీఆర్, మోదీ, కిషన్ రెడ్డి తనతో చర్చకు రావాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి నువ్వు ఎప్పుడు ఎక్కడ చర్చ పెట్టినా మేము సిద్ధం.. నువ్వు ఒక 72 గంటలు సమయం తీసుకొని...
బీజేపీ నుంచి ఎవరు వెళ్లిపోయినా పార్టీకి ఎలాంటి నష్టం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగిన సందర్భంగా పదవి ఆశిస్తూ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తనకు పదవి దక్కకపోవడంతో రాజా సింగ్ పార్టీ అధిష్టానంపై తీవ్ర...
ఏపీలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రశ్నించారు. ఇటీవల గుంటూరులో వైసీపీ కార్యకర్తపై జరిగిన దాడి నేపథ్యంలో వైయస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిందన్నారు. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో...
ఏపీలో యోగా టీచర్లు జీతాల కోసం రోడ్డెక్కారు. గత రెండు రోజులుగా విజయవాడలోని సీఎం చంద్రబాబు ఇంటి ఎదుట నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. కాగా, నేడు మంత్రి లోకేష్‌ని కలవడానికి వెళ్లిన యోగా టీచర్లపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. లోకేష్‌ని కలవడానికి వీల్లేదని తిరిగి పంపేశారు. మహిళా యోగా టీచర్లు అని కూడా...
కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న విమర్శలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణలన్నీ అబద్దాలని ఆమె అన్నారు. “మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకుపోయిందనే...