తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామ్ చంద్రారావు లేఖ రాశారు. మూసీ ప్రక్షాళనను పూర్తిగా స్వాగతిస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్,బీజేపీ నాయకులు, వారి పెంపుడు మీడియా పేదలకు అన్యాయం పేరుతో మాట్లాడేవి,చేస్తున్నవి.. అన్నీ వారి స్వప్రయోజనాలను కాపాడుకోవడం కోసమేనని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని అజీజ్ నగర్ లో...
తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై శుక్రవారం వాదనలు విన్న ధర్మాసనం.. స్వతంత్ర విచారణకు ఆదేశించింది. కల్తీ లడ్డూపై నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఐదుగురితో సిట్ ఏర్పాటు చేయాలని.. ఇందులో సీబీఐ నుంచి ఇద్దరు, సిట్(రాష్ట్రం) నుంచి ఇద్దరు, నేషనల్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒక్కరు ఉండాలని...
హైడ్రా కూల్చివేతల భయంతో హైదరాబాద్ లో మరో వ్యక్తి చనిపోయాడు. అంబర్‌పేటలోని తులసీరాం నగర్ కు చెందిన గంధశ్రీ కుమార్(55) ఇంటికి కొద్దిరోజుల కింద హైడ్రా అధికారులు మార్కింగ్ చేసి వెళ్లారు. అప్పటి నుంచి అతడికి ఇళ్లు కూలుతుందని భయం పట్టుకుంది. దీంతో బుధవారం ఉదయం గుండెపోటు వచ్చి మరణించాడు. కుమార్ భార్య కూడా...
హైదరాబాద్ నగరంలో డీజేలపై నిషేధం విధిస్తూ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్లుగా డీజేలతో పెద్ద ఎత్తున్న రూల్స్ బ్రేక్ చేశారని, ఈసారి మరింత శృతిమించి వ్యవహరించారని సీవీ ఆనంద్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజేలపై నిషేధం విధించామన్నారు....
– మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు
మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరోసారి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు రబ్బర్ చెప్పుల నుంచి డెయిరీ ఫామ్ పెట్టే స్థాయికి ఎలా వచ్చాడో అందరికీ తెలుసన్నారు. త్వరలోనే హరీశ్ రావు ఎఫ్...
ఏపీలో వరద బాధితులకు అందాల్సిన పరిహారంపై సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.602 కోట్ల పరిహారం పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.588.59 కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు 97 శాతం పంపిణీ పూర్తి చేశామన్నారు. బ్యాంక్ అకౌంట్ల లోపాలు, సాంకేతిక సమస్యల కారణంగా...
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోరు పెంచారు. ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. మంగళవారం హర్యానాలో రాహుల్ గాంధీ బహిరంగ సభ నిర్వహించారు. మోడీ ప్రజల జేబులు లూటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. పేదోడిపై పన్నులు విధుస్తూ పెద్దలకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో రూ.350 ఉండే సిలిండర్ ధర...
తిరుమల లడ్డూ కల్తీపై దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందున విచారణ వాయిదా వేశామన్నారు. కేసు తీవ్రత వల్లే సిట్ ను ఏర్పాటు చేశామని.. ఈ నెల 3న సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి దర్యాప్తు చేపడతామన్నారు.
మూసీ నదీ పరివాహక ప్రాంతంలోని ఇండ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. తొలి దశలో రివర్ బెడ్ లో కూల్చివేతలు ప్రారంభించారు. చాదర్ ఘాట్ లోని మూసా నగర్, రసూల్ పురా, శంకర్ నగర్ లోని ఇండ్లను కూల్చివేస్తున్నారు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు నష్టపరిహారంతో పాటు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
గుర్తు తెలియని దుండగులు తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు పెట్టారు. ఈ సంఘటన సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామంలో జరిగింది. సోమవారం రాత్రి ఈ దుశ్చర్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...