Tuesday, April 28, 2026

మోడీ హయాంలో జేబులు లూటీ

Must Read

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోరు పెంచారు. ఎన్డీఏ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. మంగళవారం హర్యానాలో రాహుల్ గాంధీ బహిరంగ సభ నిర్వహించారు. మోడీ ప్రజల జేబులు లూటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. పేదోడిపై పన్నులు విధుస్తూ పెద్దలకు దోచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో రూ.350 ఉండే సిలిండర్ ధర నేడు రూ.1200లకు పెరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు మద్దతు ధర, మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. సిలిండర్ ధరలను అదుపులోకి తెస్తామన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

పిఠాపురం జనసేన కార్యకర్తలతో నాగబాబు సమావేశం

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -