థియేటర్ల బంద్‌కు పిలుపు ప్రతిపాదన చేశారంటూ ఆరోపణలు వస్తున్న జనసేన నేత అత్తి సత్యనారాయణను పార్టీ సస్పెండ్ చేసింది. సత్యనారాయణ పార్టీ సభ్యత్వంతో పాటు రాజమండ్రి నగర నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. కాగా తాజాగా థియేటర్ల బంద్ ప్రకటన వెనక జనసేన నాయకుడు ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వెంటనే ఈ ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది.