టీమిండియా యువ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. 8వ స్థానంలో బ్యాటింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డిని మరింత ముందు స్థానంలో ఆడించవచ్చన్నాడు. బౌలింగ్ మెరుగు పరుచుకుంటే నితీశ్ భారత జట్టు ఆల్ రౌండర్ గా ఎదిగే అవకాశం ఉందన్నాడు.