భారత్‌లో HMPV వైరస్ విజృంభిస్తోంది. ఒక్కరోజే దేశంలో నాలుగు HMPV వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు HMPV వైరస్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తర్వాత గుజరాత్‌లోని అహ్మదాబాద్ చాంద్‌ఖేడాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రెండేళ్ల చిన్నారి ఈ వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. తాజాగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఐదు నెలల చిన్నారికి పాజిటివ్‌గా తేలింది. చిన్నారులపైనే ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. HMPV కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించింది.