Saturday, March 15, 2025

చంద్రబాబుది దోచుకో.. పంచుకో!

Must Read

– వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విరుచుపడ్డారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పండగ పూట అందరూ బిజీగా ఉంటే 108 రీచ్ లకు రెండు రోజులు టైం ఇచ్చి టెండర్ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబుది దోచుకో.. పంచుకో.. తినుకో.. నినాదమని దుయ్యబట్టారు. ఏ నియోజకవర్గం తీసుకునా ఇసుక, మద్యం, పేకాట క్లబ్ లు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు. స్థానికంగా మైనింగ్ చేయాలన్నా, ఏ పరిశ్రమ పెట్టినా చంద్రబాబుకు కప్పం కట్టాల్సిందేనని విమర్శించారు. చంద్రబాబు ఐదు నెలల పాలనలో ఎక్కడా డీబీటీ పద్ధతి కనిపించలేదన్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోతే.. ఈడీ క్లీన్ చీట్ ఇచ్చిందన్నట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు సిగ్గు లేకుండా అబద్ధాలు ప్రచారం చేయించుకుంటున్నారని మండిపడ్డారు. లిక్కర్ టెండర్లలో చంద్రబాబు భారీ కమీషన్లు నొక్కేశారని తెలిపారు. గతంలో ప్రభుత్వ అధీనంలో మద్యం నడిపితే.. ఖజానాకు భారీగా వచ్చిందన్నారు. చంద్రబాబు వచ్చాక డిస్టలరీలకు మాత్రమే లాభాల వచ్చాయన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మద్యం రేట్లు పెంచి, క్వాలిటీ తగ్గించి.. డిస్టలరీలకు మాత్రమే లాభాలు వచ్చేలా ప్లాన్ చేశారన్నారు. డిస్టలరీల నుంచి చంద్రబాబు కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు పాలనలో 20 డిస్టలరీలకు లైసెన్స్ ఇచ్చారని, అలాంటిది తమ హయాంలో మాత్రమే నాసిరకం అంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్‌ చేయొద్దు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఈనెల 12 వరకు అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -