Sunday, June 15, 2025

సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం!

Must Read

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. రూ.5కోట్లు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని ఓ అజ్ఞాత వ్యక్తి వాట్సాప్ లో ముంబయి ట్రాఫిక్ పోలీసులకు సందేశం పంపాడు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ‘‘ఇది సీరియస్ వార్నింగ్. తేలిగ్గా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో శత్రుత్వం ముగియాలన్నా.. రూ.5కోట్లు చెల్లించాలి. లేదంటే మాజీ ఎమ్మెల్యే సిద్దిఖీని(సల్మాన్ ఖాన్ స్నేహితుడు) చంపినట్లే చంపుతాం”అని బెదిరించాడు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేస్తున్నారు. మరోవైపు సల్మాన్ ఖాన్ కు భద్రత పెంచారు. ఆయన నివాసం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, సల్మాన్ ఖాన్ కు గతంలోనూ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -