ఇటీవల మహిళలతో న్యూడ్ కాల్స్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. కానీ, విచిత్రంగా ఓ మహిళ ఎమ్మెల్యేకు బలవంతంగా న్యూడ్ కాల్ చేయడం కలకలం రేపింది. హనీ ట్రాప్ లోకి దింపాలని భావించిందో లేక వీడియో రికార్డ్ చేసి డబ్బులు డిమాండ్ చేసిందో తెలియదు కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి ఒక్కసారిగా వీడియో కాల్ వచ్చింది. ఎమెర్జెన్సీ అని భావించి లిఫ్ట్ చేస్తే ఓ మహిళ అర్ధనగ్నంగా కనిపించింది. దీంతో, సదరు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ పోలీసులు ఆవిడని గాలించే పనిలో పడ్డారు.