Monday, December 9, 2024

కలెక్టర్ పై దాడి.. 55 మంది అరెస్ట్!

Must Read

వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటనలో 55మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొడంగల్ డెవలప్ మెంట్ అథారిటీ కింద వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సోమవారం గ్రామంలో అభిప్రాయ సేకరణ జరిపారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అథారిటీ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఫార్మా ఏర్పాటును గ్రామస్తులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారు. వచ్చిన అధికారులపై దాడి చేశారు. వాహనాలు ధ్వంసం చేశారు. కలెక్టర్ పైన కూడా దాడి జరిగింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు.. 55 మందిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ దాడిని నిరసిస్తూ వికారాబాద్ జిల్లా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -