ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు న్యాయస్థానం సమన్లు పంపింది. అయోధ్యకు పంపిన తిరుమల లడ్డూల్లోనూ కల్తీ నెయ్యి వాడినట్టు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని న్యాయవాది ఇమ్మనేని రామారావు వేసిన పిల్‍ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈమేరకు పవన్ కళ్యాణ్ కు సమన్లు పంపింది. వచ్చే నవంబర్ 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కోరింది.