Monday, November 4, 2024

విద్యుత్ భారం ఆపండి

Must Read

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ భారం మోపేందుకు రెడీ అవుతోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలపై రూ.18,500 కోట్ల అదనపు భారాన్ని మోపడానికి.. విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోందన్నారు. ఇండ్లల్లో వినియోగించే విద్యుత్ 300 యూనిట్లు దాటితే యూనిట్‌కు 10 రూపాయలు వసూలు చేస్తున్నారని, ఇప్పుడు దాన్ని 5 రెట్లకు పెంచి యూనిట్‌కు 50 రూపాయలు చేయాలని చూస్తున్నారన్నారు. వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్నారు. గ్రూప్–1 అభ్యర్థుల కోరిక మేరకు ఆలస్యం అయినప్పటికీ.. గురువారం సాయంత్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసోజు శ్రవణ్ నేతృత్వంలో.. కపిల్ సిబల్ లాంటి ప్రముఖ న్యాయవాదిని నియమించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్నారు. సుప్రీంకోర్టు ఈ కేసును తిరస్కరించలేదని.. పరీక్షా సమయంలో ఆపడం కరెక్ట్ కాదని మాత్రమే చెప్పిందన్నారు. రిట్ పిటిషన్ డిస్పోజ్ పై హై కోర్ట్ నిర్ణయం తీసుకునే దాకా ఫలితాలు విడుదల చేయొద్దని సుప్రీంకోర్టు సూచించిందన్నారు. ఈ కేసు ఇంకా కొనసాగుతోందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి జర్నలిస్టులు అంటే ఎంతో గౌరవం ఉందన్నారు. చాలామంది జర్నలిస్టులను ఎమ్మెల్యేలుగా మార్చామన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

మంత్రి సుభాశ్ కు చంద్రబాబు వార్నింగ్!

ఏపీ సీఎం చంద్రబాబు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పై మండిపడ్డట్లు తెలుస్తోంది. మంత్రి పనితీరు, సభ్య నమోదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనకు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -