Friday, January 24, 2025

కాంగ్రెస్ ప్రోద్బలంతోనే మత ఘర్షణలు!

Must Read

రాష్ట్రంలో మత కల్లోలాలకు కొందరు దుష్టశక్తులు కుట్రలు చేస్తున్నాయని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. కొందరు వ్యక్తులు రహస్యంగా శిక్షణ తీసుకొని, హిందువులే లక్ష్యంగా దాడులు నిర్వహిస్తున్నారన్నారు. ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ.. సోమవారం గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ జోక్యం చేసుకొని రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పాలని కోరారు. తెలంగాణలో ఎన్ని దారుణాలు జరుగుతున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే సాయిబాబా మందిరం, లుంబిని పార్క్, గోకుల్ చాట్, దిల్‍సుఖ్‍నగర్ బాంబ్ బ్లాస్టులు జరిగాయని.. ఇప్పుడు కూడా అలాంటి ఘాతులకు హైదరాబాద్ అడ్డాగా మారుతోందన్నారు. కొందరు దుర్మార్గులు హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి తదితరులున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -