Wednesday, July 2, 2025

నేడు మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం

Must Read

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో ఆస‌క్తిక‌రంగా ఎదురుచూస్తున్న 72వ ప్రపంచ సుందరి పోటీలు నేడు ప్రారంభం కానున్నాయి. దీని కోసం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఓపెనింగ్ సెర్మెనీకి సీఎం రేవంత్ రెడ్డి హాజ‌రు కానున్నారు. ఈ కార్య‌క్రమంలో వెయ్యి మందికి పైగా అతిథులు, టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు పాల్గొన‌నున్నారు. పోటీల్లో 120 దేశాల నుంచి కంటెస్టెంట్స్ పాల్గొన‌న‌నున్నారు. ఇప్పటికే 109 దేశాల నుంచి అందాల భామ‌లు హైద‌రాబాద్‌కు వ‌చ్చేశారు. తెలంగాణ సంస్కృతి, కళలు, సంప్రదాయాల మేళవింపుతో ఈ పోటీలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నెల 31 వరకు జరగనున్న పోటీలకు హైదరాబాద్‌లోని వేదికలను సుందరంగా తీర్చిదిద్దారు. ఈ వేడుక‌లు 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.పాక్ దాడుల నేప‌థ్యంలో స్టేడియం, కంటెస్టెంట్‌లు బస చేస్తున్న ట్రైడెంట్ హోటల్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ అస్త‌వ్య‌స్తం – వైయ‌స్ జ‌గ‌న్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింద‌ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ ఆరోపించారు. దీనికి ఏపీఈసెట్‌...
- Advertisement -

More Articles Like This

- Advertisement -