తెలంగాణలో వచ్చే సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ వీటిని పంపిణీ చేస్తామన్నారు. గురుకులాలకు, సంక్షేమ పాఠశాలలకు కూడా సన్న బియ్యం ఇస్తామన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ప్రకటించడం వల్ల సన్నాల సాగు పెరిగిందన్నారు. గతంలో సన్న వరి సాగు 25 లక్షల ఎకరాల్లో ఉండగా, ప్రస్తుతం 40 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు.