Sunday, December 7, 2025

క‌శ్మీర్‌లో తెలంగాణ ప‌ర్యాట‌కుల కోసం హెల్ప్ లైన్‌

Must Read

పహల్గామ్ మారణహోమంతో అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు అల‌ర్ట్ అయ్యాయి. కశ్మీర్ లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని సుర‌క్షితంగా స్వస్థలాల‌కు ర‌ప్పించేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ మేర‌కు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు వివ‌రాలు వెల్ల‌డించారు. రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున ప‌ర్యాట‌కుల‌కు సాయం అందిస్తామ‌న్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ అధికారులు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల జమ్ము, కశ్మీర్ లోప్రయాణించిన పర్యాటకుల వివరాలు వెంటనే అందించాల‌ని తెలంగాణలోని అన్ని టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లను మంత్రి కోరారు. ప‌ర్యాట‌క శాఖ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్‌ ఏర్పాటు చేశామ‌ని, పర్యాటకుల బంధువులు లేదా స్నేహితులు కూడా తమ సమాచారం అందించేందుకు, లేదా సహాయం కోసం ఈ హెల్ప్ లైన్ ను ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు.

హెల్ప్ లైన్ నంబ‌ర్లు : 9440816071, 9010659333, 040 23450368

- Advertisement -
- Advertisement -
Latest News

రైతుల సంక్షోభంపై పార్లమెంట్‌లో గర్జించాలి: జగన్ ఎంపీలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ఎంపీలను సోమవారం నుంచి ప్రారంభమయ్యే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో...
- Advertisement -

More Articles Like This

- Advertisement -