తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. దీంతో బడుల వద్ద పిల్లలతో సందడి నెలకొంది. మార్కెట్లలో విద్యార్థులకు సంబంధించి పుస్తకాలు, బ్యాగులు, ఇతరత్రా విద్యా సామగ్రి కొనుగోళ్లతో సందడి నెలకొంది. ఇదే అదునుగా భావించిన వ్యాపారులు పుస్తకాల ధరలు భారీగా పెంచేశారు. అలాగే ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు తల్లిదండ్రులకు షాకిస్తున్నాయి. ప్రభుత్వాలు చొరవ చూపి ఫీజులను నియంత్రించాలని కోరుకుంటున్నారు.