తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం బస్‌పాస్ ధరలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. 20 శాతం ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. సామాన్య ప్రజలతో పాటు, స్టూడెంట్ పాస్ ధరలను కూడా పెంచారు. ఆర్డినరీ పాస్ ధరను రూ.1,150 నుండి రూ.1,400 కు, మెట్రో ఎక్స్ ప్రెస్ పాస్ ధరను రూ.1300 నుండి రూ.1600 కు, మెట్రో డీలక్స్ పాస్ ధరను రూ.1450 నుండి రూ.1800కు పెంచారు. పెరిగిన ధరలు నేటి నుండే అమల్లోకి రానున్నాయి.