ఐపీఎల్ ప్రారంభమైన 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ 2025 ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలు చుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి పంజాబ్ కింగ్స్ జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 191 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు తడబట్టారు. నిర్ణీత 20 ఓవ ర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే సాధించారు.ఆర్సీబీ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 సాధించింది. 43 పరుగులు సాధించిన విరాట్ కోహ్లి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోహ్లి ఇన్నింగ్స్ లో 3 బౌండరీలున్నాయి. ఏకంగా 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ ముద్దాడడంతో విరాట్ కోహ్లి భావోద్వేగానికి గురయ్యారు. మైదానంలో కళ్లు చెమర్చాడు. సహచర ఆట గాళ్లను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. విరాట్ కోహ్లి మరో ఐపీఎల్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ పై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్న మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ రికార్డును బద్దలు కొట్టాడు. డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల తరఫున పంజాబ్ కింగ్స్పై మొత్తం 26 మ్యాచ్లు ఆడి 1,134 పరుగులు సాధించాడు. ఇక, కోహ్లి పంజాబ్ కింగ్స్పై 36 మ్యాచ్లు ఆడి 1,159 పరుగులు సాధించాడు.