Saturday, January 25, 2025

మోహన్ ‘బాంబు’ అసలేం జరిగింది?

Must Read

రెండ్రోజులుగా మోహన్ బాబు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య వైర్యం పెరిగిపోయింది. ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి వచ్చారు. పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకున్నారు. బౌన్సర్ల మధ్య యుద్ధమే జరిగింది. మీడియాపైనా మోహన్ బాబు దాడి చేశారు. టీవీ9 ప్రతినిధి దవడ పగిలింది. మంచు విష్ణు విదేశాల నుంచి హుటాహుటిన ఇంటికి వచ్చాడు. ఈ ఫ్యామిలీ గొడవ ఇప్పుడు తారా స్థాయికి చేరింది. మంచు మనోజ్ ను ఎంత ప్రేమగా పెంచానో మోహన్ బాబు ఒక ఆడియో కూడా విడుదల చేశారు. అసలు మోహన్ బాబు ఇంట్లో గొడవలకు కారణాలు ఏంటో తెలుసుకుందాం.

మోహన్ బాబుకు ఇద్దరు భార్యలు. ఒకరు విద్యాదేవి, మరొకరు నిర్మలాదేవి. విద్యాదేవికి మంచు విష్ణు, మంచు లక్ష్మి జన్మించారు. నిర్మలాదేవికి మంచు మనోజ్ పుట్టాడు. మంచు విష్ణు వైఎస్ఆర్ కుటుంబ సమీప బంధువు వెరోనికారెడ్డిని పెండ్లి చేసుకున్నాడు. ఇక మంచు మనోజ్ తొలుత ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకొని, నాలుగేండ్ల తర్వాత విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి బిడ్డ మౌనికారెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే, మౌనికారెడ్డిని వివాహం చేసుకోవడం మోహన్ బాబుకు నచ్చలేదని సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఆస్తుల పంపకాల విషయంలోనూ తండ్రీకొడుకులకు పొసగడం లేదని టాక్. గతంలోనూ మంచు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు జరిగాయి. ప్రస్తుతం మోహన్ బాబు, మంచు విష్ణు ఒక టీం, మంచు మనోజ్, అతని భార్య మరో టీంగా మారింది. విద్యా సంస్థల విషయంలో మంచు మనోజ్ జోక్యం చేసుకోవద్దని మోహన్ బాబు ఖరాఖండిగా చెప్పినట్లు సమాచారం. ఈ అంశాలే ఇరువురి మధ్య గొడవలకు దారి తీశాయి.

- Advertisement -
- Advertisement -
Latest News

‘పుష్ప-2’ 50 రోజులు పూర్తి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప-2 సినిమా.. నేటికి...
- Advertisement -

More Articles Like This

- Advertisement -