ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ విడులైన రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా 32 రోజుల్లో రూ.1,831 కోట్లు రాబట్టింది. దీంతో ‘బాహుబలి-2’ కలెక్షన్స్ (రూ.1810 కోట్లు) రికార్డును పుప్ప-2 బ్రేక్ చేసింది. భారీ వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో ‘పుష్ప-2’ సినిమా రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో ఉన్న ‘దంగల్’ (రూ.2వేల కోట్లకుపైగా) వసూలు చేసింది.