Sunday, June 15, 2025

పెళ్లి చేసుకున్న అక్కినేని అఖిల్‌!

Must Read

అక్కినేని న‌ట వార‌సుడు అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్ వివాహ‌బంధంలోకి అడుగుపెట్టాడు. నేడు తెల్లవారుజామున 3 గంటలకు త‌న ప్రియురాలు జైనబ్‌ను వివాహం చేసుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని నాగార్జున నివాసంలో ఈ పెళ్లి వేడుక జ‌రిగింది. అతి కొద్ది మంది బంధువులు, స‌న్నిహితుల మ‌ధ్య ఈ పెళ్లి వేడుక నిర్వ‌హించారు. తెలుపు వ‌స్త్రాల్లో అఖిల్‌,జైన‌బ్‌ దంప‌తులు ఆక‌ట్టుకున్నారు. జూన్ 8 ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో రిసెప్షన్ వేడుక నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -