తెలంగాణలో పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. దీని కోసం తేదీ కూడా నిర్ణయించినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జూన్ చివరికల్లా ఎన్నికల ప్రకటన కూడా జారీ కానున్నట్లు తెలుస్తోంది. గురువారం మంత్రి వర్గ భేటీలో ఉద్యోగుల డిమాండ్లు, మెట్రో విస్తరణ, రహదారుల అభివృద్ధి సహా మొత్తం 56 కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించేందుకు ఈ నెల 15న మరోసారి మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. అప్పుడే పూర్తిస్థాయిలో ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాజకీయ వర్గాలతో పాటు రాష్ట్ర ప్రజల్లో స్థానిక ఎన్నికలపై తీవ్ర చర్చ నడుస్తోంది.