Sunday, June 15, 2025

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపినాథ్‌కు అస్వస్థత

Must Read

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థ తకు గురయ్యారు. ఆయ‌న‌ను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. మాగంటి గోపీనాథ్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు.
గోపీనాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. మాగంటి గోపీనాథ్‌కు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. కానీ, సోష‌ల్ మీడియాలో ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ప‌లు ర‌కాలుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -