Sunday, June 15, 2025

ప‌ల్లాకు క‌విత ప‌రామ‌ర్శ‌

Must Read

ఎర్ర‌వెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహైస్‌లో బాత్రూంలో జారిప‌డి కాలి గాయంతో ఆస్ప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్న జ‌న‌గామ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డిని ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత పరామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. కాలి గాయంతో యశోద ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించడం జరిగింద‌ని, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు. కేసీఆర్ నేడు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజర‌య్యారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం సాయంత్రం మాజీ మంత్రి హరీశ్‌ రావుతో పల్లా రాజేశ్వర్ రెడ్డి కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. ప‌ల్లా అక్క‌డ‌ తీవ్ర అస్వస్థతకు గురై బాత్రూంలో కాలుజారి పడిపోయారు. దీంతో ఆయన కాలు విరిగినట్లుగా సమాచారం. ఫామ్‌హౌస్ సిబ్బంది పల్లా రాజేశ్వర్ రెడ్డిని అంబులెన్స్‌లో యశోదా ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -