Sunday, June 15, 2025

క‌మిష‌న్ ముందు నిల్చోపెట్టి పైశాచిక ఆనందం – కేటీఆర్

Must Read

బీఆర్ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వ‌రం క‌మిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా కేటీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్‌ను కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ….ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడేన‌ని, మీరంతా సూర్యుడిని అరచేతితో ఆపాలనుకునే మూర్ఖులేన‌ని విమ‌ర్శించారు. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవ‌ని సెటైర్లు వేశారు. తెలంగాణ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణని తెచ్చింది కేసీఆర్ నాయకత్వం అని, తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు అని, ఇది చ‌రిత్ర‌లో ఎప్ప‌టికీ నిలిచిపోయే వాస్త‌వం అని పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -