హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. నేడు హైటెక్స్‌లో ఫైనల్స్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ పోటీల వేడుకలను 150 దేశాల్లో లైవ్ టెలీకాస్ట్ చేస్తున్నారు. గ్రాండ్ ఫైనల్స్ కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాల్లోని సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. నేడు రాత్రి 9:15 గంటలకు మిస్‌వరల్డ్ విజేతను ప్రకటించనున్నారు. గ్రాండ్ ఫైనల్స్ కోసం వీఐపీలు రానున్న సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మిస్‌వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు.కాగా, టాప్-40లో మిస్ ఇండియా నందిని గుప్తా సైతం ఉన్నారు.