ఏపీలో మెగా డీఎస్సీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మొదటి సంతకం మెగా డీఎస్సీపైన పెట్టిన సంగతి తెలిసిందే. కాగా, జూన్ 6 నుంచి జూలై 6 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఆన్‌లైన్ పద్ధతిలో జరుగనున్నాయి. మొదట టీజీటీ పరీక్షలు నిర్వహించనున్నారు. చివరలో ఎస్జీటీలకు పరీక్షలు జరుగుతాయి. రోజుకు రెండు విడతలుగా పరీక్షలు కొనసాగుతాయి. ఇప్పటికే అభ్యర్థులకు వెబ్ సైట్లో మెగా డీఎస్సీ హాల్ టికెట్లు అందుబాటులో ఉంచారు.