ఇటీవల భారత్-పాక్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ స్పందించారు. గతంలో రెండు దేశాలు సమన్వయం కలిగి ఉండాలని సూచించిన ఆయన ఈసారి ఏకంగా యుద్ధం తానే ఆపినట్లు చెప్పుకున్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని, దాడులు చేసుకుంటూ, అణ్వాయుధాలను ఉపయోగించే దేశాలతో వ్యాపారం చేయనని స్పష్టం చేశానని వివరించారు. ఇరు దేశాల్లోని గొప్ప నేతలు తన మాటను విని యుద్ధాన్ని విరమించారంటూ ధన్యవాదాలు చెప్పారు. మరోవైపు పాకిస్థాన్ కోరితేనే కాల్పులు విరమించినట్లు, మరో దేశ ప్రమేయం లేదని మోదీ, జైశంకర్ పలుమార్లు స్పష్టం చేశారు. దీనిపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. దేశ ప్రజల ఆగ్రహం మీద నరేంద్ర మోదీ నీళ్లు చల్లారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.