Sunday, June 15, 2025

అక్ర‌మ మైనింగ్ కేసులో గాలికి బెయిల్

Must Read

ఓబులాపురం అక్ర‌మ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట ల‌భించింది. ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈయ‌న‌తో పాటు మ‌రో ముగ్గురికి ఈ కేసులో బెయిల్ ల‌భించింది. గాలి జ‌నార్ధ‌న్‌రెడ్డి పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాసరెడ్డి, రాజగోపాల్‌ల‌కు బెయిల్ మంజూరైంది. ఈ నలుగురికి నాంపల్లి సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను హైకోర్టు సస్పెండ్ చేసింది. దేశం విడిచి వెళ్లరాదని, రూ.10 లక్షలు సొంత పూచీకత్తు సమర్పించాలని షరతు విధించింది. ప‌దిహేనేళ్ల విచార‌ణ త‌ర్వాత ఈ న‌లుగురికి ఇటీవ‌ల నాంప‌ల్లి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష‌, రూ.20 వేల జ‌రిమానా విధించింది. హైకోర్టు తీర్పుతో వీరికి ఊర‌ట ల‌భించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

కొమ్మినేనికి సుప్రీం కోర్టులో ఊర‌ట‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌ల కేసులో అరెస్ట్ అయిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని శ్రీనివాస‌రావుకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. నేడు సుప్రీం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -