Monday, December 9, 2024

రేవంత్ కోసం రైతులు బలి

Must Read

సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం కోసం రైతులు బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జైలులో లగచర్ల రైతులను ఆయన కలిశారు. పోలీసులు లగచర్ల రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. రేవంత్ కనుసన్నల్లో కొడంగల్ సీఐ, కొడంగల్ ఎస్ఐ, వికారాబాద్ ఎస్పీ కలిసి రైతులను కొట్టారని పేర్కొన్నారు. వాళ్ల కాళ్లు, చేతులు కమిలిపోయాయని తెలిపారు. కులగణన కోసం వచ్చిన ప్రభుత్వ ఉద్యోగిని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. పరామర్శకు వెళ్లిన బంధువులను కూడా అక్రమంగా జైలుపాలు చేశారని ఆరోపించారు. మొత్తం 70మందిని అరెస్ట్ చేస్తే.. కాంగ్రెస్ కార్యకర్తల్ని వదిలి బీఆర్ఎస్ కార్యకర్తలనే జైలులో వేశారని తెలిపారు. రైతులకు బేడీలు వేసి జైలుకు పంపారని వాపోయారు. గ్రామంలో ఫార్మా కంపెనీ నచ్చక ప్రజలంతా తిరగబడితే.. ఇదంతా బీఆర్ఎస్ కుట్ర అంటూ కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని తెలిపారు. రేవంత్ రెడ్డిపై నేడు కొడంగల్ మర్లవడ్డదని.. రేపు తెలంగాణ మొత్తం మర్లవడుతదని తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

స్కూళ్లకు భారీగా బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఢిల్లీలోని 40 స్కూళ్లకు ఏక కాలంలో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఓ అజ్ఞాత వ్యక్తి ఈ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -