తమ సమస్యల పరిష్కారం కోసం జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామన్న ఫిల్మ్ ఛాంబర్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఫిల్మ్ ఛాంబర్ యథావిథిగా కొనసాగనున్నట్లు ప్రకటించింది. థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో శనివారం ఫిల్మ్ ఛాంబర్‌లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలు అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం సమావేశానికి సంబంధించిన వివరాలను ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ వెల్లడించారు. ఆల్ సెక్టార్ల మీటింగ్ తర్వాత అందరూ కలిసి తీసుకొన్న నిర్ణయం ఇది అని వ్యాఖ్యానించారు. మా సమస్యలను మేమే పరిష్కరించుకొంటామని చెప్పారు. ఈ సమస్య లపై ఈ నెల 30 న కమిటీ వేస్తున్నట్లు వెల్లడించారు. థియేటర్ల బంద్ గురించి తప్పుగా ప్రచారం చేశారన్నారు. సినీ పరిశ్రమలోని సమస్యలపై మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసి వివరిస్తామని చెప్పారు.