ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రజా సమస్యల పరిష్కారానికి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టెక్కలి నియోజకవర్గంలో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. వెండి తెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా “మన ఊరు – మాటామంతి” అనే పేరుతో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంతో ప్రజల ముందుకు వచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని భవాని థియేటర్ దీనికి వేదికైంది. కార్యక్రమంలో ప్రజల కష్టాలు తెలుసుకొని వాటి పరిష్కారానికి మార్గం చూపటమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.