ఏపీ డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్ రుషికొండను పరిశీలించారు. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన భవనాలను చూశారు. విజయనగరం పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఆకస్మికంగా రుషికొండ భవనాలను తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందితో మాట్లాడారు. ఆయన వెంట విశాఖ ఎంపీ భరత్, యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ తదితరులున్నారు. రుషికొండ పర్యటన అనంతరం విశాఖ విమానాశ్రయానికి బయల్దేరారు.
