దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్యంలో మునిగింది. మూడో రోజు కాలుష్యం తీవ్రత పెరిగింది. దీంతో స్టేజ్–3 ఆంక్షలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ప్రైమరీ స్కూళ్లు మూతపడ్డాయి. చిన్న పిల్లల్ని బయటకు రానివ్వడం లేదు. ఉద్యోగుల పని వేళలను మార్చింది. భవన నిర్మాణ పనుల్ని నిలిపివేయాలని ఆదేశించింది. గాలి కాలుష్యం పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం పడుతోంది.