Saturday, July 5, 2025

జ‌పాన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Must Read

జ‌పాన్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆ దేశానికి చేరుకున్నారు.ఈ రోజు ఉద‌యం నారిటా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం బృందం ఏప్రిల్ 22 వరకు జపాన్‌లో పర్యటించ‌నున్నారు. టోక్యో, మౌంట్‌ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో ప‌లు స‌మావేశాల్లో పాల్గొన‌నున్నారు. ఒసాకా వరల్డ్‌ ఎక్స్‌పో 2025లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించ‌నున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు, వివిధ శాఖల ఉన్నతాధికారులు సీఎం వెంట ఉన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ఆ దేశ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. టొయోటో, సోనీ, టొషీబా, మజ్దా తదితర కంపెనీల సీఈఓలు, వైస్ ప్రెసిడెంట్ తదితరులతో చర్చలు జరపడంతో పాటు ఆ కంపెనీల ఉత్పత్తి ప్లాంట్లను సందర్శించనున్నారు. వాడుతున్న టెక్నాలజీ, యువతకు లభిస్తున్న ఉపాది తదితర అంశాలనూ అధ్య‌యనం చేయనున్నారు. ఈ నెల 23న తిరిగి ఈ బృందం నగరానికి చేరుకోనుంది.

- Advertisement -
- Advertisement -
Latest News

ఆస్ప‌త్రిలో ఫిష్ వెంక‌ట్‌.. ఆదుకున్న ప్ర‌భాస్?

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత అనారోగ్య‌ సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు. దీంతో పాటు షుగర్, బీపీ వ్యాధులతో రావ‌డంతో ఆస్ప‌త్రి పాల‌య్యారు. కొద్ది రోజుల...
- Advertisement -

More Articles Like This

- Advertisement -